ఎన్టీఆర్ జిల్లా పెద్దవాగులో చిక్కుకున్న 100 మంది విద్యార్థులు

ఏపీ(AP)లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

Update: 2024-09-24 15:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్(NTR) జిల్లాలోని పెద్దవాగుకు వరద పోటెత్తింది. జిల్లాలోని నున్న సమీపంలోని ఈ వాగుకు అకస్మాత్తుగా భారీ వరద రావడంతో..  వాగు అవతలి ఒడ్డున గల వికాస్ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్థులు, పొలాల పనుల నిమిత్తం వెళ్ళిన 50 మంది వరకు రైతులు, కూలీలు అందులో చిక్కుకు పోయారు. దాదాపు రెండు గంటల పాటు వాగు ఉద్ధృతి తగ్గుతుందని ఎదురు చూసిన విద్యార్థులు.. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారందరినీ రక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు.  


Similar News