వైఎస్ఆర్‌కు విరుద్ధంగా వెళ్ళొద్దు

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల దాడి కొనసాగుతోంది. న‌వ‌ సూచ‌న‌లు పేరుతో శనివారం ఐదో లేఖ రాశారు. తెలుగు బాషను అంతం చేయోద్దంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీలోని పాఠశాలల్లో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి తెలుగు మీడియానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు భాషను చిదిమేయాలనే దురుద్దేశంతో కోర్టులలో వేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని సీఎం జగన్‌కు లేఖలో విజ్ఞప్తి చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ […]

Update: 2021-07-03 03:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల దాడి కొనసాగుతోంది. న‌వ‌ సూచ‌న‌లు పేరుతో శనివారం ఐదో లేఖ రాశారు. తెలుగు బాషను అంతం చేయోద్దంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీలోని పాఠశాలల్లో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి తెలుగు మీడియానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు భాషను చిదిమేయాలనే దురుద్దేశంతో కోర్టులలో వేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని సీఎం జగన్‌కు లేఖలో విజ్ఞప్తి చేశారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు భాష‌ను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. విద్యా హ‌క్కు చ‌ట్టం 2009ని అమ‌లు చేయ‌డంలో భాగంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్బంధ‌ ఉచిత విద్యా చ‌ట్టం 2010 తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆ చ‌ట్టం పిల్ల‌ల‌కు వారి మాతృభాష‌లోనే విద్యా బోధ‌న జ‌ర‌పాల‌ని చెప్తోందన్నారు. అలాంటి చట్టాన్ని తీసుకువచ్చిన వైఎస్ఆర్‌కు సీఎం జగన్ పూర్తి విరుద్ధంగా వెళ్తున్నారంటూ విమర్శించారు. తెలుగు స‌రిగ్గా నేర్చుకోక‌పోవ‌డం, తెలుగులో స్ప‌ష్టంగా మాట్లాడలేక‌పోవ‌డం తెలుగు భాష‌ను అవ‌మానించ‌డ‌మే కాదు. మ‌న క‌న్న‌త‌ల్లిని అవ‌మానించ‌డమేనని లేఖలో ఎంపీ రఘురామ విమర్శించారు.

Tags:    

Similar News