ఖమ్మం జిల్లాలో మరో ఐటీ హబ్
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరానికి మరో ఐటీహబ్ మంజూరయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలించింది. దాదాపు రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగులతో ఐటీహబ్-2 నిర్మాణం చేయనున్నారు. ఒకేసారి 570 మంది వర్క్ చేసుకునే వెసులుబాటుతో విశాలమైన సముదాయం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖమ్మంలోని ఇల్లందు నియోజకవర్గ సర్కిల్ వద్ద […]
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరానికి మరో ఐటీహబ్ మంజూరయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలించింది. దాదాపు రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగులతో ఐటీహబ్-2 నిర్మాణం చేయనున్నారు. ఒకేసారి 570 మంది వర్క్ చేసుకునే వెసులుబాటుతో విశాలమైన సముదాయం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖమ్మంలోని ఇల్లందు నియోజకవర్గ సర్కిల్ వద్ద గల ప్రస్తుత ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించి సేవలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు నేడు ఐటీ హబ్-2కు పరిపాలన అనుమతులు రావడంతో జిల్లా యువతలో మరింత ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు ఖమ్మం గుమ్మంలోనే అందుబాటులోకి రానున్నాయి. అతి త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.