ఏపీలో మరో శిరోముండనం ఘటన
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో శిరోముండనం ఘటన మరవకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్(23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. బాకీని తీర్చాలంటూ విజయ్‌బాబు గత మూడు రోజులుగా అభిలాష్‌ని అడుగుతున్నాడు. ఇదే […]
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో శిరోముండనం ఘటన మరవకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేశారు.
జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్(23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. బాకీని తీర్చాలంటూ విజయ్‌బాబు గత మూడు రోజులుగా అభిలాష్‌ని అడుగుతున్నాడు.
ఇదే విషయమై 3వ తేదీ రాత్రి విజయ్‌బాబు, తన మిత్రులు షేక్ నాగూల్ మీరావలి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి అభిలాష్‌ను కారులో ఎక్కించుకుని జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి తీసుకొచ్చి ఓ ఇంట్లో ఉంచారు. తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో మరో వ్యక్తితో అభిలాష్‌కు శిరోముండనం చేయించారు.
అనంతరం బాధితుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలి వెళ్లారు. అనంతరం అభిలాష్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయబాబుతో పాటు మరో ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.