వర్క్ ఫ్రమ్ హోమ్‌కే కంపెనీల మొగ్గు
కొవిడ్-19 ప్రభావంతో దిగ్గజ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని చేయడం వల్ల కలిగే లాభాలను బేరీజు వేసుకున్నాయి. ఈ క్రమంలో తమ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తూ కార్యాలయ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరో కంపెనీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు […]
కొవిడ్-19 ప్రభావంతో దిగ్గజ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని చేయడం వల్ల కలిగే లాభాలను బేరీజు వేసుకున్నాయి. ఈ క్రమంలో తమ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తూ కార్యాలయ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరో కంపెనీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సిగ్నల్ ఇచ్చింది.
కెనడాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ షాపిఫై తమ ఉద్యోగులను శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. 2021 తర్వాత ఇక ‘ఆఫీస్ వర్క్’ అనే ప్రసక్తే లేదని, ఈ కొత్త తరహా విధానాన్ని తాము అలవరుచుకోబోతున్నట్లు షాపిఫై సీఈవో టోబీ లుట్కే ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు. ఉద్యోగి ఆఫీస్‌కు రాకుండానే తమ పనులన్నీ చక్కబెడుతుండటంతో ప్రయాణ సమయాన్ని తగ్గించే యోచనలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించడంలో ఎలాంటి సంకోచం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే గూగుల్ వంటి కంపెనీలు మాత్రం పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.