మరో 51,390 మందికి ‘జగనన్న చేదోడు’
దిశ, ఏపీ బ్యూరో: జగనన్న చేదోడు పథకం కింద మరో 51,390మందికి లబ్ది చేకూరుస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం విజయవాడలో ఆయన లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. మొదటి విడతలో 2.57లక్షల మందికి పథకం ద్వారా రూ.247.04 కోట్లు అందించినట్లు తెలిపారు. నాయకుల సిఫారసుల్లేకుండా వాస్తవంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరేట్లు పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని, దర్జీలు, సెలూన్షాపులు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, ఇస్ర్తీ షాపులు […]
దిశ, ఏపీ బ్యూరో: జగనన్న చేదోడు పథకం కింద మరో 51,390మందికి లబ్ది చేకూరుస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం విజయవాడలో ఆయన లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. మొదటి విడతలో 2.57లక్షల మందికి పథకం ద్వారా రూ.247.04 కోట్లు అందించినట్లు తెలిపారు. నాయకుల సిఫారసుల్లేకుండా వాస్తవంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరేట్లు పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని, దర్జీలు, సెలూన్షాపులు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, ఇస్ర్తీ షాపులు పెట్టుకున్న రజకులకు పథకం వర్తింపజేస్తున్నట్లు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 90శాతం హామీలను అమలు చేసినట్లు మంత్రి వేణుగోపాల్ వివరించారు.