కొత్తగా మరో 12 సెంటర్లు.. వైద్యశాఖ కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 12 సీటీ స్కాన్​ మిషన్​లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్​లోని ఈఎన్​టీ, చెస్ట్​ హాస్పిటల్​, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్​తో పాటు కరీంనగర్​, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ, సిరిసిల్లా, సిద్ధిపేట్​, వరంగల్​లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సిటీ స్కాన్​ మిషన్లను వైద్యశాఖ సమకూర్చనున్నది. ఒక్కో మిషన్​ను సుమారు 2 కోట్ల ఖర్చుతో ఇన్​స్టాల్ చేసినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో మిషన్లను ఏర్పాటు చేయగా, సోమవారం నుంచి […]

Update: 2021-12-04 18:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 12 సీటీ స్కాన్​ మిషన్​లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్​లోని ఈఎన్​టీ, చెస్ట్​ హాస్పిటల్​, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్​తో పాటు కరీంనగర్​, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ, సిరిసిల్లా, సిద్ధిపేట్​, వరంగల్​లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సిటీ స్కాన్​ మిషన్లను వైద్యశాఖ సమకూర్చనున్నది. ఒక్కో మిషన్​ను సుమారు 2 కోట్ల ఖర్చుతో ఇన్​స్టాల్ చేసినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో మిషన్లను ఏర్పాటు చేయగా, సోమవారం నుంచి విడతల వారీగా ఒక్కో కేంద్రంలో షురూ చేయనున్నారు. తొలుత ఉస్మానియా ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు చేతల మీదుగా సీటీ స్కాన్​ మిషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే జనగామ జిల్లాలోనూ మరో యంత్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఎంతో ముఖ్యం..

కొవిడ్‌తో పాటు ఇంకా అనేక రకాల చికిత్సల్లో సీటీ స్కాన్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెదడులో తీవ్రతను తెలుసుకునేందుకు, శరీరంలో కణతులు గుర్తించడానికి , ఊపిరితిత్తుల, ఛాతీ ఇన్‌ఫెక్షన్లు, సైనస్‌లలో కూడా సీటీ స్కాన్‌ చాలా అవసరం. సాధారణంగా ఛాతీ గాలితో నిండి ఉంటుంది. అలా కాకుండా రక్తం, నీటితో గానీ నిండితే అప్పుడు సీటీ స్కాన్‌లో ఆ తేడాను గమనించవచ్చు. ఇప్పటికే కొన్ని సర్కార్​ ఆసుపత్రుల్లో మిషన్లు ఉన్నా అవి పాత రకానికి చెందినవి కాగా, మరో కొన్ని ఆసుపత్రుల్లో మూలకు పడ్డాయి. దీంతో ఇప్పడు అత్యాధునిక సీటీస్కాన్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అన్ని ఆసుపత్రుల్లోనూ అవస్థలే…

పేద రోగులు చికిత్స పొందే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్​, చెస్ట్​తో పాటు జిల్లాల్లోని సర్కార్​ దవాఖాన్లలోనూ సీటీ స్కాన్ల సమస్య ఉన్నది. దీంతో ఆయా ఆసుపత్రులకు వచ్చే వేలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనాకి స్పెషల్​ ట్రీట్​మెంట్​ అందిస్తున్న గాంధీ, టిమ్స్​, కింగ్ ​కోఠిల్లోనూ మిషన్లు మూలకు పడ్డాయి. అంతే గాక బ్లాక్​ ఫంగస్​ నోడల్​ కేంద్రమైన ఈఎన్​టీలోనూ సీటీ స్కాన్​ మిషన్​ కూడా మూలకు పడ్డది. దీని వలన సీటీ స్కాన్​ చేయించుకునేటోళ్లకు నరకం కనిపిస్తోంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడకు వెళ్లాలో తెలియక ఎంతో మంది అవవస్థలు పడుతున్నారు. చేసేదేమీ లేక పేషెంట్లు ప్రైవేట్​కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడినది.

Tags:    

Similar News