అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించలేం

దిశ, ఏపీ బ్యూరో : హనుమంతుని జన్మస్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించలేమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. కాగా, ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళశాస్త్రం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హనుమంతుడి జన్మస్థలాన్ని టీటీడీ ప్రకటించింది. తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని […]

Update: 2021-07-20 11:03 GMT

దిశ, ఏపీ బ్యూరో : హనుమంతుని జన్మస్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించలేమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు.

కాగా, ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళశాస్త్రం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హనుమంతుడి జన్మస్థలాన్ని టీటీడీ ప్రకటించింది. తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని నిర్ధారించింది. అయితే టీటీడీ ప్రకటించిన విషయం కేంద్రం దృష్టికి వచ్చినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News