సోనమ్ అంటే అంత భయమా ?
ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచే బాలీవుడ్ దివా సోనమ్ కపూర్‌ను ఇష్టపడని వారుండరు. అందరితో ఇట్టే కలిసిపోయే ఈ భామ.. తన పుట్టినరోజును పుట్టింట్లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి ముంబై వచ్చేసింది. కాగా, అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన సోనమ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భర్త ఆనంద్ ఆహుజా, చెల్లెలు రియా కపూర్, సోదరుడు అర్జున్ కపూర్‌తో పాటు బంధువులు, మిత్రులు ఇలా చాలా మంది […]
ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచే బాలీవుడ్ దివా సోనమ్ కపూర్‌ను ఇష్టపడని వారుండరు. అందరితో ఇట్టే కలిసిపోయే ఈ భామ.. తన పుట్టినరోజును పుట్టింట్లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి ముంబై వచ్చేసింది. కాగా, అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన సోనమ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భర్త ఆనంద్ ఆహుజా, చెల్లెలు రియా కపూర్, సోదరుడు అర్జున్ కపూర్‌తో పాటు బంధువులు, మిత్రులు ఇలా చాలా మంది విష్ చేశారు. అయితే సోనమ్ తండ్రి, సీనియర్ హీరో అనిల్ కపూర్ తనదైన శైలిలో స్పెషల్ విష్ చేశాడు.
‘నా కూతురిలాగా మరెవరూ ఉండరేమో.. తను ఆనంద్ ఆహుజాకు సరైన భాగస్వామి.. సూపర్ స్టార్.. స్టైల్ ఐకాన్’ అని కూతురిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘తనే నా ధీమా.. నా సంతోషం.. నా గర్వం.. నా జీవితంలో చూసిన హృదయపూర్వకమైన వ్యక్తి’ అంటూ కూతురిపట్ల ప్రేమను వ్యక్తపరిచాడు. అంతే కాదు నేను భయపడే ఒకే ఒక వ్యక్తి కూడా తనే అంటూ సీక్రెట్ రివీల్ చేశాడు. ప్రస్తుతం మంచి మాస్టర్ చెఫ్ అయిన మా మంచి బంగారు సోనూకు హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేశాడు. ఈ పుట్టినరోజున నువ్వు మాతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.