పురాతన పెయింటింగ్ అమ్మేసిన ఏంజెలీనా జోలీ
దిశ, ఫీచర్స్ : అమెరికన్ ఫేమస్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీ తన దగ్గరున్న పురాతన పెయింటింగ్‌ను వేలం వేయగా, 11.5 మిలియన్ డాలర్ల (రూ.84 కోట్ల) ధర పలికడం విశేషం. ఈ పెయింటింగ్‌ను ఏంజెలీనా తన మాజీ భర్త బ్రాడ్ పిట్‌తో కలిసి 2011లో కొనుగోలు చేయగా, అది ఇప్పుడు మరొకరి సొంతమైంది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన అతిపురాతన మసీదు, అట్లాస్ పర్వతాలను అందంగా డ్రా చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్. ఆయన రెండో […]
దిశ, ఫీచర్స్ : అమెరికన్ ఫేమస్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీ తన దగ్గరున్న పురాతన పెయింటింగ్‌ను వేలం వేయగా, 11.5 మిలియన్ డాలర్ల (రూ.84 కోట్ల) ధర పలికడం విశేషం. ఈ పెయింటింగ్‌ను ఏంజెలీనా తన మాజీ భర్త బ్రాడ్ పిట్‌తో కలిసి 2011లో కొనుగోలు చేయగా, అది ఇప్పుడు మరొకరి సొంతమైంది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన అతిపురాతన మసీదు, అట్లాస్ పర్వతాలను అందంగా డ్రా చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్. ఆయన రెండో ప్రపంచ యుద్ధం (1939-45) సమయంలో ఈ పెయింటింగ్ గీయడం ప్రారంభించి 1943లో కంప్లీట్ చేశారు. మొరాకోలోని మర్రాటెక్ సిటీ విజిట్ సందర్భంగా, ఆ ట్రిప్‌కు గుర్తుగా అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్‌కు ఇచ్చారు విన్‌స్టన్ ఈ పెయింటింగ్‌ను అందజేశారు. రూజ్‌వెల్ట్ మరణానంతరం ఆయన తనయుడు దీన్ని వేలంలో విక్రయించారు. అప్పుడు వేలంలో దక్కించుకున్నవారు 2011లో మరోసారి వేలం వేయగా కొనుగోలు చేసిన ఏంజెలీనా జోలీ.. తాజాగా వేలంలో విక్రయించింది.