నిరాశపరిచిన ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే నాలుగో అతిపెద్ద బ్రోకింగ్ సేవలను అందించే ఏంజిల్ బ్రోకింగ్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయింది. అయితే..ఇన్వెస్టర్లను నిరాశపరిచే విధంగా ట్రేడింగ్ జరిగింది. సోమవారం 10 శాతం డిస్కౌంట్‌తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ తీర్వమైన ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరకు లిస్ట్ చేసిన ధరవద్దే ట్రేడవ్వడం మదుపర్లను తీవ్రంగా నిరాశపరిచింది. ఉదయం ప్రారంభమైన సమయంలో రూ. 275 వద్ద సెన్సెక్స్, నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభించిన ఏంజెల్ బ్రోకింగ్ ప్రారంభంలోనే […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే నాలుగో అతిపెద్ద బ్రోకింగ్ సేవలను అందించే ఏంజిల్ బ్రోకింగ్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయింది. అయితే..ఇన్వెస్టర్లను నిరాశపరిచే విధంగా ట్రేడింగ్ జరిగింది. సోమవారం 10 శాతం డిస్కౌంట్‌తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ తీర్వమైన ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరకు లిస్ట్ చేసిన ధరవద్దే ట్రేడవ్వడం మదుపర్లను తీవ్రంగా నిరాశపరిచింది.
ఉదయం ప్రారంభమైన సమయంలో రూ. 275 వద్ద సెన్సెక్స్, నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభించిన ఏంజెల్ బ్రోకింగ్ ప్రారంభంలోనే రూ. 257కి దిగజారింది. అనంతరం కోలుకునే సంకేతాలు కనిపించినప్పటికీ మళ్లీ ఇష్యూ చేసిన ధరకే చేరుకుంది. ఏంజెల్ బ్రోకింగ్ ఇష్యూ ధర రూ. 306 కాగా, ఇంట్రాడే హై రూ. 296.45గా మారి, చివరికి 10 శాతం నష్టపోయి రూ. 275.85 వద్ద ట్రేడింగ్ ముగించింది. సెప్టెంబర్ నెలలో ముగిసిన పబ్లిక్ ఇష్యూలో ఏంజెల్ బ్రోకింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లను సాధించింది.
షేర్ ధర రూ. 306తో మొత్తం 12 సంస్థలకు కేటాయింపులు జరిపింది. దాంతో గత నెల ఐపీవో ద్వారా ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ రూ. 600 కోట్లను సమకూర్చుకుంది. అయితే, ఈ నెల ఎన్నో అంచనాలతో మొదలైన పబ్లిక్ ఇష్యూ ఊహించని స్థాయిలో నష్టాలతో ట్రేడయింది. కాగా, ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ మొత్తం 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్టు, 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. క్లయింట్ల పరంగా దేశంలోనే నాలుగో అతిపెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ బ్రోకింగ్ కొనసాగుతోంది.