వారి రక్షణలో అంగన్వాడీ టీచర్లదే ముఖ్యపాత్ర: ఎమ్మెల్యే
దిశ, ఇబ్రహీంపట్నం : శిశు రక్షణ, గర్భిణీ మహిళలు, బాలింతల సంరక్షణలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం, మున్సిపాలిటీలకు చెందిన 15 మంది అంగన్వాడీ టీచర్లకు, 10 మంది ఆయాలకుఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి యూనిఫామ్ చీరలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు, గర్భిణీ మహిళలకు, బాలింతలకు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడి టీచర్లకు, […]
దిశ, ఇబ్రహీంపట్నం : శిశు రక్షణ, గర్భిణీ మహిళలు, బాలింతల సంరక్షణలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం, మున్సిపాలిటీలకు చెందిన 15 మంది అంగన్వాడీ టీచర్లకు, 10 మంది ఆయాలకుఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి యూనిఫామ్ చీరలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు, గర్భిణీ మహిళలకు, బాలింతలకు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పి.కృపేష్, చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సిడిపిఓ బీ సుజని, ఎంపిటిసిలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.