సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తా: Nara lokesh

రాయలసీమ సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చర్చా వేదిక నిర్వహించారు. ..

Update: 2023-06-07 13:28 GMT

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చర్చా వేదిక నిర్వహించారు. మిషన్ రాయలసీమ పేరుతో పార్టీ నాయకులు, ప్రముఖులుతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధిపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో సీమ కష్టాలు చూశానని.. సీమ కన్నీళ్లు తుడుస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్రానిక్స్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కారిడార్ల ద్వారా ఇండస్ట్రీస్‌ను అభివృద్ధి చేస్తానని వ్యాఖ్యానించారు.

ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాయలసీమలోని మైనింగ్ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. మైనింగ్ స్కిల్డ్ పనులు ఏపీ రాష్ట్రం వాళ్లే చేసేలా నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. సీమకు సిమెంట్, బిల్డింగ్, మెటీరియల్స్ కంపెనీలను తీసుకొస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. రాయలసీమలో టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినా తాము అలా చూడలేదన్నారు. టీడీపీ హాయాంలో అభివృద్ధిని వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. మొత్తం రాయలసీమను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 

Read more:  అవినాశ్‌రెడ్డిని కాపాడటమే వైసీపీ ఎంపీల పని

Tags:    

Similar News