Pulivendula Firing Case: భరత్ యాదవ్ అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం

Pulivendula Firing Case Accused Bharat Yadav Arrested

Update: 2023-03-29 15:14 GMT

దిశ, కడప: పులివెందుల కాల్పుల ఘటనలో భరత్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలతో భరత్ యాదవ్, దిలీప్‌ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో  దిలీప్‌పై భరత్ కాల్పులు జరిపారు. అయితే మహబూబ్ బాషా అనే వ్యక్తి అడ్డుపడడంతో ఆయనపైనా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దిలీప్ మృతి చెందగా, బాషా చికిత్స పొందుతున్నారు. భరత్ కుమార్ యాదవ్ నుంచి తుపాకీ, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కాగా భరత్ యాదవ్‌పై 2019లో హత్యాయత్నం జరిగింది. అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తి హత్య కేసులో సాక్షిగా ఉన్నారు. దీంతో భరత్‌కు పోలీసులు తుపాకీ లైసెన్స్ మంజూరు చేశారు. పులివెందుల కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, వారి ఆదేశాల మేరకు తుపాకీ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Tags:    

Similar News