‘అహంకారం+అత్యాశ= షర్మిల’ అంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్
వైఎస్ షర్మిలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: అహంకారం+అత్యాశ= షర్మిల అని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(YCP leader Rachamallu Sivaprasad Reddy) అన్నారు. జగన్, షర్మిల(Jagan, Sharmila) మధ్య ఆస్తుల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆశ ఉంటే తప్పులేదని, షర్మిలది అత్యాశ అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ దగ్గర నుంచి వేల కోట్లు దండుకోవాలని షర్మిల చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు(Chandrababu), రేవంత్ రెడ్డి(Revanth Reddy), సోనియా గాంధీ(Sonia Gandhi)తో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని ఏలాలనే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పదవులు కావాలనే అత్యాశలో షర్మిల ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ(Telangana)లో పార్టీ పెట్టి అంగడి మూసేందని విమర్శించారు. అక్కడ కుదరకపోయే సరికి ఏపీకి వచ్చి లేని పార్టీ పేరుతో జగన్‌ను బజారుకీడ్చారని మండిపడ్డారు. జగన్‌ను రాజకీయంగా పతనం చేయడమే షర్మిల లక్ష్యమని రాచమల్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వచ్చిన వివాదం కాదని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తి విషయంలో వివాదం వచ్చిందని తెలిపారు. కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ఆస్తులను, తల్లికి షర్మిల అబద్ధం చెప్పారని రాచమల్లు వ్యాఖ్యానించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో విజయమ్మకు జగన్ 51 శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని రాచమల్లు తెలిపారు.