Breaking: వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్.. కడపకు తరలింపు
పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు...
దిశ, వెబ్ డెస్క్: పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. రెండు క్రితం వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో కేసులో రాజంపేట పోలీసులకు అప్పగించే క్రమంలో వర్రా రవీంద్రారెడ్డి పారిపోయారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వర్రా రవీందర్ రెడ్డిని తెలంగాణకు పారిపోతుండగా అరెస్ట్ చేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మపైనా వర్రా రవి అసభ్య పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ప్రధాన అనచరుడిగా ఉన్న వర్రా రవీంద్రారెడ్డి గత ఐదేళ్లలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అయితే అప్పటి ప్రభుత్వం వర్రాను ప్రోత్సహించినట్లుగా విమర్శలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూనే ఉన్నారు. వైఎస్ సునీతపైనా సోషల్ మీడియాలో అభ్యకర పోస్టులు పెట్టడంతో హైదరాబాద్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ వర్రా రవీంద్రారెడ్డిపైనా దాదాపు 30 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.