Kadapa: రిమాండ్ ఖైదీ జంప్.. ఏడుగురిపై వేటు
కడప జిల్లాలో రిమాండ్ ఖైదీ పారిపోవడంపై డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి సీరియస్ అయ్యారు..
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాలో రిమాండ్ ఖైదీ పారిపోవడంపై డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఆదేశించారు. దీంతో ఏడుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన నాగిరెడ్డిపై కిడ్నాప్ కేసుతో పాటు 30 కేసులున్నాయి. దీంతో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెల 15న జమ్మలమడుగులో కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి నాగిరెడ్డి తప్పించుకుని పారిపోయాడు. దీంతో నాగిరెడ్డిని తీసుకెళ్లిన ఏడుగురు కానిబుళ్లను సస్పెండ్ చేయాలని కడప జిల్లా ఎస్పీకి డీజీపీ సూచించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ ఖైదీ నాగిరెడ్డిని త్వరగా పట్టుకోవాలని మిగిలిన పోలీసులను ఆదేశించారు.