Viveka Murder Caseలో కీలక మలుపు.. సీబీఐ విచారణకు పీబీసీ ఉద్యోగి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్ర కారాగారం అతిథి గృహంలో గురువారం సీబీఐ ఈ కేసును విచారించింది...

Update: 2023-03-02 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్ర కారాగారం అతిథి గృహంలో గురువారం సీబీఐ ఈ కేసును విచారించింది. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఉద్యోగి సుధాకర్‌ను ప్రశ్నించింది. రెండుగంటలకు పైగా సుధాకర్‌ను సీబీఐ బృందం విచారించింది. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో ఫోటో దిగిన విషయమై ప్రశ్నించినట్టు పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఉద్యోగి సుధాకర్ వెల్లడించారు. సుధాకర్‌తోపాటు హత్య జరిగిన రోజు వైఎస్ వివేకా ఇంటికెళ్లిన వారిని సీబీఐ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్నవారిపైనే సీబీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండు సార్లు ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించింది. అలాగే ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సైతం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంతలో ఎంపీ అవినాశ్ రెడ్డికి సన్నిహిత ఉద్యోగి, పులివెందుల బ్రాంచ్ కెనా ఉద్యోగి సుధాకర్‌ను విచారించడం గమనార్హం.

Tags:    

Similar News