వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి అదిరిపోద్ది: కొడాలినాని
తెలుగు దేశం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మినీ మ్యానిఫెస్టోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఇచ్చింది.
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మినీ మ్యానిఫెస్టోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఇచ్చింది. దీనిపై మాజీ మంత్రి వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నాని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి అదిరిపోద్ది.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో చంద్రబాబు 650 వాగ్దానాలు ఇచ్చారని, వాటిలో ఏ మేరకు అమలు చేశారో చెప్పాలన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు చర్చకు రావాలని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. అమలు చేయలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని సవాలు విసిరారు. తన హయాంలో రైతులకు చంద్రబాబు 10 శాతం కూడా రుణమాఫీ చేయలేదన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు ఇళ్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. వైసీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలనుంచి అదిరిపోద్దని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే అలాంటి పధకాలు అందుబాటులో ఉన్నప్పుడు కొత్తగా టీడీపీ హామీ ఇవ్వడంలో అర్ధమేంటనే ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను తూచా తప్పకుండా ప్రతినెలా అందిస్తోంది. ఈ విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించలేరు. అటువంటప్పుడు అవే పధకాలను కొత్తగా ఇస్తామనడం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుందన్నారు.