జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్‌ను అవమానించిన షర్మిల

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Update: 2022-09-23 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్న అధికార వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉండగా.. యూనివర్శిటీ పేరు మార్పు అంశంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరు.. మరో ప్రభుత్వం మారుస్తే వారిని అవమానపర్చినట్లేనని అన్నారు.

అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడుతారా.. రేపు వచ్చే ప్రభుత్వం మళ్లీ పేరు మారిస్తే.. అప్పుడు వైఎస్సాఆర్‌ను కూడా అవమానించినట్లే కదా..? అని ప్రశ్నించారు. అయినా ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సాఆర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని.. వైఎస్సాఆర్‌కు ఉన్న ఖ్యాతి ప్రపంచంలో ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానించారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు అటు వైసీపీకి, ఇటు టీడీపీకి మింగుడుపడటం లేదు. ఓ వైపు జగన్ నిర్ణయం సరికాదంటూనే.. పరోక్షంగా ఎన్టీఆర్ కంటే వైఎస్సాఆర్ గొప్ప వ్యక్తి అనేలా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ కంటే వైఎస్సాఆర్ గొప్పవాడు అనడం ఆయనను అవమానించడమేనని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :

జగన్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల 


Similar News