YS Sharmila: లోక్‌సభ ఎన్నికల బరిలోకి వైఎస్ షర్మిల.. పోటీ ఆ స్థానం నుంచే?
క్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు తాము పోటీ చేసే స్థానాలను సైతం వెల్లడించారు.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు తాము పోటీ చేసే స్థానాలను సైతం వెల్లడించారు. ఇప్పటికే అసెంబ్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి నుంచి పోటీలో ఉండబోతున్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం అనూహ్యంగా కడప నుంచి లోక్‌సభ బరిలోకి దిగబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం కడప జిల్లా నేతలతో ఆమె కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ మీటింగ్‌లో ఆమె పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న వేళ ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిల గెలిచి నిలుస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.
Read More..
పవన్ తప్పుకుంటే సీటు నాదే..పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?