ఆ విషయంలో కంటతడి పెట్టుకున్న వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ప్రతిపార్టీ రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించాలనే ప్రయత్నిస్తోంది.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ప్రతిపార్టీ రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించాలనే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పార్టీలన్నీ ఆచితూచి అడుగులేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో అన్న చెల్లి మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. ఒకప్పుడు అన్నకోసం పోరాడిన వీర వనిత వైఎస్ షర్మిల నేడు అన్నపైనే పోరాటం చేస్తోంది. ఇక తాజాగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భావోద్వేగానికి గురైయ్యారు. తన కుటుంబసభ్యులే తనని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి లాంటి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్‌కు ఎన్నికల అంశం కానే కాదని.. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం బాధాకరమని కన్నీరు పట్టుకున్నారు.
ఇక పదేళ్ల పాటు ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది వైఎస్ షర్మిల తెలిపారు. అలానే ప్రత్యేక హోదా ఏపీ రాష్ట్రానికి ఊపిరి అని.. దాన్ని సాధించేందుకు అంతా పోరాడాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. అయితే వైఎస్ షర్మిలకు ఆమె అన్న జగన్ కు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటున్న విషయం అందరికి తెలిసిందే.
ఇక ఓ వైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే మరోవైపు వైఎస్ షర్మిల జగన్ చేసిన అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించాలని పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఓ వైపు ఎన్నిక సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మరో వైపు ఇలా సొంత చెల్లి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.