AP పాలిటిక్స్‌లో సంచలన పరిణామం.. లోక్ సభ స్పీకర్ ఎన్నికపై YS జగన్ షాకింగ్ డెసిషన్..!

లోక్ సభ స్పీకర్ ఎన్నిక దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఏండ్లుగా వస్తోన్న ఆనవాయితీగా వస్తోన్న సంప్రాదాయానికి బ్రేక్

Update: 2024-06-25 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ స్పీకర్ ఎన్నిక దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఏండ్లుగా ఆనవాయితీగా వస్తోన్న సంప్రాదాయానికి బ్రేక్ పడి.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ లోక్ సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరగబోతుంది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి ససేమిరా అనడంతో తొలిసారి లోక్ సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా.. సీనియర్ ఎంపీ సురేష్‌ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు షూరు చేశాయి.

ఇందులో భాగంగానే లోక్ సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. ఈ క్రమంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు తెలపడం ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని ఓడించి అధికారం చేపట్టింది.

ఎన్నికల్లో తమ ప్రత్యర్థులు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసి తమను ఓడించిన బీజేపీకి స్పీకర్ ఎన్నికలో జగన్ మద్దతు తెలపడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా జగన్ బద్దశత్రువులైనా టీడీపీ, జనసేనలు సైతం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. స్పీకర్ ఎన్నికలో జగన్ ఎన్డీఏకు మద్దతు పలకడంతో ఆంధ్రప్రదేశ్‌లోని 25 మంది ఎంపీల ఓట్లు ఓం బిర్లాకే పడనున్నాయి. ఎన్నికల్లో తమను ఘోరంగా ఓడించిన ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇవ్వడం వెనక ఉన్న వ్యూహాం ఏమిటి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే, రాష్ట్రంలో పవర్ లేకపోవడం.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉండటంతో కేసుల నుండి తప్పించుకునేందుకు జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా జగన్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం పొలిటికల్ కారిడార్స్‌లో చర్చనీయాంశంగా మారింది. 


Similar News