వలంటీర్లకు వైఎస్ జగన్ బర్త్ డే కానుక..జనవరి నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లోని వలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వాలంటీర్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లుగా నెలకు రూ.5వేల జీతంతో వలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే వలంటీర్లకు పనిభారం అధికమవుతున్న నేపథ్యంలో ఈ జీతాన్ని కొద్దిగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. జనవరి నుంచి అదనంగా రూ.750 పెంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూర నుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వలంటీర్లకు కానుకగా గౌరవ వేతం పెంచుతున్నామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.