CBI COURT: వైఎస్ భాస్కర్ రెడ్డికి చుక్కెదురు

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది..

Update: 2023-04-29 11:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్‌ను పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 29తో వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ ముగియడంతో అధికారులు ఆయనను నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో బెయిల్ పిటిషన్‌పైనా వాదానలు జరిగాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును జూన్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని రిమాండ్‌కు అప్పగించాలని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వకూడదని సూచించారు.

భాస్కర్ రెడ్డి రిమాండ్ గొడిగింపు

అయితే సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించినట్లు వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టుకు తెలియజేశాడు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సమాచారం అంతా ఇచ్చానని..తన అనారోగ్యం దృష్టి అయినా బెయిల్ ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డి అభ్యర్థించారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సీబీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు రిమాండ్‌ను పొడిగించారు. మే 10వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది.

Tags:    

Similar News