Viveka Case: సీబీఐ కోర్టులో వైఎస్‌ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్

వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వైఎస్‌ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు...

Update: 2023-09-14 13:50 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వైఎస్‌ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు అరోగ్యం సరిగాలేదని.. ఈ మేరకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా ఇదే కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇటీవలే తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

కాగా 2019 మార్చి 14న పులివెందులో వైఎస్ వివేకానందారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు చంద్రబాబు ఈ కేసును సిట్‌కు అప్పగించారు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే వివేకానందారెడ్డి కుమార్తె సుప్రీంకోర్టుకు వెళ్లడంలో కేసును సీబీఐ అప్పగించడంతో పాటు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది. దీంతో అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు వైఎస్ అవినాశ్ రెడ్డి, పలువురు నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వైఎస్ భాస్కర్‌రెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తన అనారోగ్యం దృష్ట్యా 15 రోజుల పాటు బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.

More News : పవన్ కళ్యాణ్ ప్రకటనతో వైసీపీలో ఆందోళన.. 2014 రిజల్ట్స్ రిపీట్ అవుతాయా..?

Tags:    

Similar News