Tirumala : తిరుమలలో కిస్సిక్ సాంగ్ రీల్ పై యువతి క్షమాపణలు

తిరుమలలో పుష్ప 2(Pushpa 2) సినిమా కిస్సిక్ సాంగ్(kissik song) పై రీల్ చేసిన యువతి(Young woman)తన చర్య పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపింది.

Update: 2024-12-04 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో పుష్ప 2(Pushpa 2) సినిమా కిస్సిక్ సాంగ్(kissik song) పై రీల్ చేసిన యువతి(Young woman)తన చర్య పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపింది. తెలియక తప్పు చేశానని, వాతావరణం బాగుండటం..పాట ట్రెండింగ్ లో ఉండటంతో అలా చేశానని, కాని అది తప్పుగా ప్రజల్లోకి వెలుతుందని తాను ఊహించలేదన్నారు. తెలియక తప్పు జరిగిందని.. ఇలాంటి తప్పు మరోసారి చేయనని, నన్ను చూసి ఇంకెవరు కూడా తప్పు చేయవద్దని, నన్ను శ్రీవారి భక్తులు, టీటీడీ క్షమించాలని కోరారు. ఈ మేరకు ఆ యువతి వీడియో విడుదల చేశారు.

అంతకుముందు తిరుమల దారుల్లో కిస్సిక్ సాంగ్ పై డ్యాన్స్ తో ఆ యువతి చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమల పరిసరాల్లో రీల్ చేయడంపై పలువురు విమర్శలు చేయడంతో జరిగిన తప్పును గ్రహించిన యువతి తన తప్పును క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేశారు. 

Tags:    

Similar News