సీఎం జగన్‌కు షాక్.. ఏపీ పరిస్థితులపై పీకే సంచలన కామెంట్స్
సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలింది. ఏపీ పరిస్థితులపై వైసీపీ వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలింది. ఏపీ పరిస్థితులపై వైసీపీ వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సంక్షేమం పేరుతో ప్రజలకు సీఎం జగన్ డబ్బులు పంచిపెడుతున్న నేపథ్యంలో అప్పులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. సంపద సృష్టితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే మాట ప్రశాంత్ కిషోర్ నోటి నుంచి సైతం వచ్చింది. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ‘షార్ప్ ఇన్ సెట్స్ ఆన్ ఇండియా-2024’ కార్యక్రమం కోసం ప్రశాంత్ కిషోర్‌ను ఓ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీ పరిస్థితులను ప్రస్తావించారు. అయితే జర్నలిస్టు ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ బదులు ఇస్తూ ‘‘సంపద సృష్టించకపోతే సంక్షేమ పథకాలు నడపడం కష్టం. సంపద సృష్టి బాధ్యత ప్రభుత్వాలదే. సంపద సృష్టికి ప్రభుత్వాలు సహకరించాలి, లేకపోతే డబ్బులు ఎలా పంచగలుతారు. సంక్షేమ పథకాలకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది. ప్రభుత్వం వద్ద సొమ్ములు లేక పోతే భారీగా అప్పులు చేయాల్సి వస్తుంది. సంపద సృష్టిస్తేతే దాన్ని పంచగలం.’ అని స్పష్టం చేశారు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చంద్రబాబు చెప్పిన మాట అక్షరాల నిజం అని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నుంచి అదే మాట వచ్చిందని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు.
Prasanth Kishore about Andhra welfare disaster :
— Telugu360 (@Telugu360) October 29, 2023
" States must create wealth, then only try to distribute the wealth as welfare schemes. If you are not creating the wealth, you will keep on borrowing endlessly. That must be happening in some states " @PrashantKishor… pic.twitter.com/dU8fXMa9fW