ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ కన్‌ఫామ్.. రేపు టీడీపీలోకి..
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి నూజివీటు టీడీపీ టికెట్ కన్ఫామ్ కావడంతో ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు....
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి నూజివీటు టీడీపీ టికెట్ కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రేపు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు సమక్షంలో సోమవారం పార్థసారథి సైకిల్ ఎక్కబోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన పెనమలూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం పెనమలూరు నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించింది. దీంతో ఆయన ఆ పార్టీని వీడుతున్నానని చెప్పారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. సీటు ఇస్తామని హామీ ఇచ్చారు.
అయితే శనివారం టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పార్థసారథికి నూజివీడు నుంచి సీటు దక్కింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. సోమవారం టీడీపీలో చేరిన తర్వాత నూజివీడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై ఏం మాట్లాడతారన్న చర్చ మొదలైంది.