YCP MLC Duvvada : అల్లు అర్జున్ అరెస్ట్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు
హీరో అల్లు అర్జున్ (Allu Arjun)అరెస్ట్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada's)కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కనుసైగలతోనే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందని ఆరోపణలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్ (Allu Arjun)అరెస్ట్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada's)కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కనుసైగలతోనే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందని ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తొందర పడ్డారని అన్నారు. కళాకారులను విమర్శించే వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం అని అన్నారు. నా అరెస్టుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని..41ఏ నోటీసుల జారీ పై పోలీసులను కోర్టుకు ఎక్కిస్తానని శ్రీనివాస్ తెలిపారు. నోటీస్ లో పోలీసులు నన్ను ఎక్కడికి, ఏ తేదీన రావాలో చెప్పలేదని, తాను ఇక్కడే ఉంటానని.. ఎవరొచ్చి అరెస్టు చేస్తారో చూస్తా అని సవాల్ చేశారు.
నన్ను అరెస్టు చేసే ముందు పవన్ కల్యాణ్ ను అరెస్టు చేసి నా వద్దకు రావాలన్నారు. కేసులు తనకేమి కొత్త కాదని... 18 కేసుల్లో ఏ1గా ఉన్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడుతూ, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ గుర్తు చేశారు. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.