AP News:‘వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో వైసీపీ(YSRCP), టీడీపీ నేత(TDP Leaders)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ(YSRCP), టీడీపీ నేత(TDP Leaders)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో వైసీపీ(YCP) ఖాళీ కావడం ఖాయం అంటూ బాంబ్ పేల్చారు. వైసీపీలో కొనసాగితే ప్రజా వ్యతిరేకత తప్పదని వైసీపీ ఎమ్మెల్యే(YCP MLAs)లు నిర్ణయానికి వచ్చారని అన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరబోతున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు(CM Chandrababu), నారా లోకేష్(Minister Nara Lokesh)లతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) పగటి కలలు కంటున్నారని.. జమిలీ ఎన్నికలకు ఎన్డీయే కూటమి భయపడటం లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ ఎన్నికలు త్వరగా జరిగిన వైసీపీ నుంచి పోటీ చేసే వారే ఉండరని, మాజీ సీఎం జగన్(YS Jagan) బి.ఫాంలు ఇస్తామని బతిమాలినా ఎవరూ తీసుకోరని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం(AP Government) తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తేల్చి చెప్పారు.