AP Cabinet Meeting:ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం!

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఈ రోజు(గురువారం) ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం(Cabinet Meeting) ప్రారంభమైంది.

Update: 2024-12-19 10:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఈ రోజు(గురువారం) ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం(Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు 21 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల పీడీఎస్(PDS) బియ్యం అక్రమ రవాణా పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యల పై కేబినెట్‌లో చర్చించారు. జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి పనులను రద్దుచేసి తిరిగి మాడిఫై చేసిన 5 పనులకు రీ టెండర్లు పిలిచేందుకు, అగ్రిమెంట్ గడువు పొడిగించేందుకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు.

అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు రూ.8821 కోట్లు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనులు చేపట్టేందుకు రూ.24316 కోట్లు మంజూరు ప్రతిపాదనకు ఆమోదించారు. 176 మంజూరు కేడర్ స్ట్రెంత్‌ను నూతనంగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలు మున్సిపాలిటీలకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆమోదం తెలిపారు. ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు కేఎఫ్ డబ్ల్యు నుంచి రూ.16 వేల కోట్లు రుణం తీసుకోవడానికి ఆమోదం లభించింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News