Cm Chandrababu: మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి..

Update: 2024-12-19 10:23 GMT

దిశ, వెబ్ డెస్క్: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు (Revenue Conferences)జరుగుతున్నాయి. అయితే ఈ సదస్సులను మరింత కాలం కొనసాగించాలని కూటమి ప్రభుత్వం(Alliance Government) సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ మంత్రుల(Ministers) పని తీరు విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ సదస్సులో రోజు రోజుకు ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో అన్నింటికి పరిష్కారం చూపేందుకు సమయం సరిపోవడం లేదు. ఫలితంగా దస్త్రాలు పేరుకుపోతున్నాయి. పలు మంత్రిత్వ శాఖల్లో పరిష్కారం చూపాల్సిన ఫైళ్లు కుప్పలు కుప్పలుగా మిగిలిపోతున్నాయి.

దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Cm Chandrababu) అసహనం వ్యక్తం చేశారు. ఫైళ్లు పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సక్రమంగా సాంకేతికతను వినియోగించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మంత్రుల పని తీరును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నామని తెలిపారు. మంత్రి వద్దకు వచ్చిన ఫైలు ఎంతసేపు పెండింగ్‌లో ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, ప్రజల నుంచి నుంచి దరఖాస్తుల ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. 

Tags:    

Similar News