జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. కండువా కప్పిన పవన్ కల్యాణ్

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు.

Update: 2024-03-07 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. బలిజ కులస్తులంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిట్టదని అన్నారు. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితమే వదిలినా సస్పెండ్ చేయలేదని.. కానీ, తనను మాత్రం వెంటనే సస్పెండ్ చేశారని ఆవేదన చెందారు. కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై చిన్నచూపు చూశారని విమర్శించారు.

వైసీపీకి బలిజలు అంటే పట్టదని.. బలిజలు వైసీపీకి ఓటు వేయరని సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కోటరీ భావన అని అన్నారు. 6 జిల్లాల్లో 74 స్థానాలు ఉంటే 2019లో బలిజ వర్గానికి రెండు స్థానాలు కేటాయించారన్నారు. 2024 ఎన్నికల్లో ఒక్క స్థానం ఇవ్వలేదని మండిపడ్డారు. బలిజలు అంటే ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. తిరుపతిలో పోటీ చేసే అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టమని.. పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకే అడుగులు వేస్తానని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.

Read More..

ఏపీలో ఫ్యాన్ గాలి తగ్గిందా..? విశ్లేషకులు ఏమంటున్నారు ..?  

Tags:    

Similar News