CM జగన్‌కు మరో షాక్.. సొంత ప్రభుత్వంపై YCP ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

అధికార వైసీపీ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. రోజు రోజుకు పార్టీలో అసమ్మతి నేతలు పెరిగిపోవడమే కాకుండా.. సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేయడం జగన్ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది.

Update: 2023-01-31 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. రోజు రోజుకు పార్టీలో అసమ్మతి నేతలు పెరిగిపోవడమే కాకుండా.. సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేయడం జగన్ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ఫ్యాన్‌కు పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేయగా.. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. చివరికి నా కుటుంబ సభ్యులకు కూడా వాట్సప్ కాల్ చేయాల్సి వస్తోందని ఆరోపించారు.

సొంత పార్టీ వాళ్లే నా ఫోన్ ట్యాప్ చేస్తే.. నేను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని.. ఎలాంటి హత్య రాజకీయాలు చేయలేదని.. సీబీఐ కేసుల్లో హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదని పరోక్షంగా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు. వెంకటగిరి వైసీపీలో అనిశ్చిత నెలకొందని.. నియోజకవర్గంలో వైసీపీ మూడు వర్గాలుగా తయ్యారైందని పేర్కొన్నారు.

Read more:

Kodi Kathi case : విచారణకు సీఎం జగన్ హాజరుకావాల్సిందే: జడ్జి ఆదేశాలు

Tags:    

Similar News