వైసీపీ నేత ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి ఫైర్

గతంలో సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్‌ పెట్టాడని ఫిర్యాదులు అందడంతో.. కేసు నమోదు కావడంతో వైసీపీ(ycp) నేత వైసీపీ నేత ప్రేమ్‌కుమార్‌‌(Premkumar)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-12-12 08:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్‌ పెట్టాడని ఫిర్యాదులు అందడంతో.. కేసు నమోదు కావడంతో వైసీపీ(ycp) నేత వైసీపీ నేత ప్రేమ్‌కుమార్‌‌(Premkumar)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఎస్పీకి YCP నేతల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) మాట్లాడుతూ.. తమ పార్టీ నేత ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రేమ్‌కుమార్‌‌ అరెస్ట్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. రాష్ట్రంతో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను వేధిస్తున్నారని.. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. ఈ వ్యవహారాలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.


Similar News