పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కుట్రలు : విష్ణువర్థన్ రెడ్డి

నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.

Update: 2023-02-23 10:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎన్నికల రోజునే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ జారీ చేయడంపై విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు.

ఈ చర్యలు ఎమ్మెల్సీ ఎన్నికల పై వైసీపీకి ఉన్న ఓటమి భయాన్ని తెలియజేస్తోంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ను తక్షణమే వెనక్కి తీసుకొని, పట్టభద్రులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News