జర్నలిస్టుపై వైసీపీ కార్యకర్తల దాడి.. మాణిక్కం ఠాగూర్ సెన్సేషనల్ ట్వీట్

సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు ‘సిద్ధం’ సభలో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఫొటో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-02-19 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు ‘సిద్ధం’ సభలో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఫొటో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఖాళీ కుర్చీలను ఫొటో జర్నలిస్టు తన కెమెరాలో బంధించడం జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా జర్నలిస్ట్‌పై ఎటాక్ చేశారు. ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అనంతపురంలో ఫొటో జర్నలిస్టుపై జగన్ పార్టీ నేతలు విచక్షణారహితంగా దాడికి దిగడం దారుణం. 2024 ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దాడికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. జర్నలిజానికి స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇలాంటి చర్యలను నిర్ద్వందంగా ఖండిద్దాం.’ అంటూ ట్వీట్ చేశారు. ఈ దాడిని రెండు తెలుగు రాష్ట్రాల ఫోటో జర్నలిస్టుల సంఘాలు ముక్తకంఠంగా ఖండించిన విషయం తెలిసిందే.


Similar News