యువతుల ఉన్నత విద్యకు టీడీపీ-జనసేన ఆర్థిక భరోసా:యరపతినేని

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం యువతుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

Update: 2024-03-08 13:42 GMT

దిశ,గురజాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం యువతుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలలకు రెక్కలు పథకం వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఒక్క యువతీ ఉన్నత విద్యకు ఆర్థిక అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. ఇంటర్ విద్య పూర్తి చేసిన యువతులు ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు కొనసాగించేందుకు అవసరమైన బ్యాంకు రుణాలు ఇప్పించి దానికి ప్రభుత్వమే హామీగా ఉండి వడ్డీ చెల్లించేలా పథకాన్ని రూపుదిద్దారన్నారు. దీనివల్ల డబ్బు లేదని కలలతో రాజీ పడే అవసరం తెలుగింటి ఆడబిడ్డలకు రాకుండా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించడం సంతోషకరంగా ఉందన్నారు. యువతులు దీన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.


Similar News