ప్రజాప్రతినిధుల పీఏల ఉపసంహరణ..ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లాకలెక్టర్‌ ఉత్తర్వులు

సాధారణ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వీరిని గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలో రిపోర్టు చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా ఉత్తర్వులిచ్చారు.వీరికి పోస్టింగ్‌లిచ్చి నివేదిక ఇవ్వాలని ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-18 13:13 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ:సాధారణ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వీరిని గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలో రిపోర్టు చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా ఉత్తర్వులిచ్చారు.వీరికి పోస్టింగ్‌లిచ్చి నివేదిక ఇవ్వాలని ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి,శాసనసభ సభ్యుల వద్ద పీఏలుగా పనిచేస్తున్న పది మందికి ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే ఆయా శాఖల రిపోర్టు చేసే అవకాశం ఉంది.పీఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులు రాజకీయ, అధికార వ్యవహారాలను చక్కబెడతారు.రాష్ట్ర సచివాలయంనుంచి కలెక్టరేట్‌, కిందస్థాయి కార్యాలయం వరకు వీరే చక్రం తిప్పుతారు. ఆర్థికపరమైన లావాదేవీలను చాలా మంది వీరికే అప్పగిస్తారు. నేతల వ్యవహారాల్లో వీరే అత్యంత కీలక భూమిక పోషిస్తారు.

అధికార పార్టీ వారి వద్ద పనిచేసే వారు మరింత ముందుంటారు.వీరు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో రిపోర్టు చేసినా విధుల్లో చేరకుండా తెరవెనుక ఎన్నికల వ్యవహారాల్లో ఆయా నియోజకవర్గాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది.అన్నీ తామై ఆయా నాయకుల పనులు చక్కబెట్టే వీలుంది. ఈమేరకు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పిఏ ఎన్‌వీ సుబ్బారావు,ఏవో, రంపచోడవరం డీఎల్‌పీవో కార్యాలయం,కురసాల కన్నబాబు పిఏ పి.శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఎంసీ,పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ పిఏ కస్తూరి వాణిశ్రీ, సీనియర్‌ అసిస్టెంట్‌, కత్తిపూడి పీఐయూ సబ్‌డివిజన్‌, పెండెం దొరబాబు వి.రామ్‌గోపాల్‌,పిఏ ఏపీఎంఎఫ్‌సీ ఈడీ,తదితరులనుపెద్దనాపల్లి పంచాయతీ కార్యదర్శులను వేంటనే విధుల నుంచి విడుదల చేశారు.


Similar News