AP Politics: టీడీపీకి భారీ ఊరట..ఆ నియోజకవర్గంలో 11 నామినేషన్ల ఉపసంహరణ

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసింది.

Update: 2024-04-29 13:45 GMT

దిశ, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసింది. ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉంగుటూరులో ముగ్గురు, ఏలూరులో ఒకరు, కైకలూరులో ముగ్గురు, పోలవరంలో ఒకరు , నూజివీడులో ఇద్దరు, చింతలపూడిలో ఒకరు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దెందులూరు లో ఎవరు నామినేషన్లు వెనక్కి తీసుకోలేదు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కారం మల్లేశ్వరరావు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వెంపా దుర్గారావు నూజివీడు లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముద్దరబోయిన రాధిక తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ రెబల్ గా బరిలో దిగి చివరి నిముషంలో వైదొలిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథికి భారీ ఊరట లభించింది. చంద్రబాబును కలిసి ముద్రబోయిన మళ్లీ తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండియన్ లేబర్ పార్టీ(అంబేద్కర్,ఫూలే) అభ్యర్థి కనికెళ్ల మురళీకృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థి పత్సమట్ల్ల భీమరాజు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

Tags:    

Similar News