బర్రెలక్కని గెలిపించి రాజ్యాంగానికి వన్నె తేవాలి..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్ధిని గెలిపించి, భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

Update: 2023-11-26 11:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్ధిని గెలిపించి, భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి, బర్రెలక్కకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. మంగళగిరిలో ఆదివారం వీజే కాలేజీలో రాజ్యాంగ దినోత్సవంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన, వ్యక్తి పూజలు రాచరికానికి దారితీస్తాయని వెల్లడించారు. ‘మనకోసం మనం రాసుకున్న రాజ్యాన్ని పరిరక్షించాలంటే, ఎన్నికల్లో డబ్బున్న వారికి కాదు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకే నేను కొల్లాపూర్ బర్రెలక్క కోసం ప్రచారం చేసానని చెప్పాను. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా ఇప్పటికైనా ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులతో బర్రెలక్క విజయానికి కృషి చేయాలి’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో కొత్త పంథాలో

2024 ఎన్నికల్లో తాను కొత్త పంథాలో రాజకీయ బరిలో దిగుతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతిసారి పాత వారే ఎన్నికల బరిలో నిలబడితే ఎందుకు వారికి ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. డబ్బు, వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్ధిని గెలిపించి, భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి, బర్రెలక్కకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈసారి తాను ఏపీ ఎన్నికల బరిలో కచ్చితంగా, ప్రభావవంతంగా నిలుస్తానని సీబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...మార్పు కోసం తాను ఈసారి ఏపీ ఎన్నికల్లో పోరాడతానని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా విద్యార్థులు జేడీ కమ్ బ్యాక్ అంటూ, ఆయనలాంటి వారు చట్టసభల్లో ఉండాలని నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన జేడీ, అరాచకాలకు, డబ్బు కట్టలకు, బంధుత్వాలను తావులేని ఆంధ్రప్రదేశ్ కోసం తాను ఈసారి బరిలో ఉంటానని...జీరో పాలిటిక్స్ ని క్లిక్ చేయడానికే, తాను తెలంగాణా ఎన్నికల్లో శిరీషకు మద్దతు తెలిపానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Tags:    

Similar News