రోడ్డు ప్రమాదంలో అభిమానుల మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇవాళ(శుక్రవారం) పిఠాపురంలో పర్యటిస్తున్నారు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇవాళ(శుక్రవారం) పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో రాజమహేంద్రవరం నుంచి పిఠాపురం(Pithapuram) వెళ్లే మార్గంలో రామస్వామి పేట వద్ద ఏడీబీ(ADB) రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? తదితర వివరాలను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఇతర అధికారులను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు వెంట కాలినడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. దీంతో పాటు ఇటీవల ‘గేమ్‌ఛేంజర్’(Game Changer) ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. Game Changer ఈవెంట్‌కు హాజరై తిరిగి ఇంటికి వెలుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.