మోడీ వెంట జగన్ నడుస్తారా? :ముందస్తుపై వైసీపీ ప్లాన్ ఇదేనా?
కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోందంటూ పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోందంటూ పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దేశంలో బీజేపీ గాలి మళ్లీ వీస్తుండటంతో దీన్ని క్యాష్ చేసుకోవాలంటే ముందస్తుకు వెళ్లడమే మంచిదనే ఒపీనియన్ ప్రధాని నరేంద్రమోడీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో బీజేపీ గాలి వీస్తోందని అలాగే అధికారం చేజిక్కించుకోని రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తుకు ప్రధాని నరేంద్రమోడీ అండ్ టీం సై అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ముందస్తుకు సై అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఏవిధంగా ఉండబోతుంది..? ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్‌కు ముందస్తు ఎన్నికలు కలిసి వస్తాయా? అన్న ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది.
ముందస్తుపై మోడీ వ్యూహం
భారతీయ జనతాపార్టీ బలహీన పడుతోందని.. కాంగ్రెస్ పుంజుకుంటుందని ఇటీవల కొంతకాలంగా జోరుగా ప్రచారం జరిగింది. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని ఇక బీజేపీ పని అయిపోయిందని అంతా ప్రచారం జరిగింది. అనంతరం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సైతం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ సైతం గతం కంటే పుంజుకుంటుంది. మెరుగైన ఫలితాలను సైతం సాధిస్తోంది. మారుతున్న రాజకీయసమీకరణాల దృష్ట్యా ముందస్తు దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ టీం ముందస్తుకు సై అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
వైసీపీ వ్యహాత్మకం
బీజేపీ ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం ఏమాత్రం తగ్గదని.. గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ టీడీపీల మధ్య గట్టిపోటీ ఉంటుందని తెలుస్తోంది. అయితే అత్యధిక స్థానాలు తామే గెలుపొందుతామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలలో తమకే అనుకూల ఫలితాలు వస్తున్నాయిని వైసీపీ చెప్తోంది. మెుత్తానికి ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఎన్నికలపై మాత్రం వైసీపీ ధీమా మాత్రం ఉంది. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తమను మళ్లీ ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ బల్లగుద్ది మరీ చెప్తోంది.