బెయిల్ వచ్చేనా?: హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుసగా ఉపశమనాలు కలుగుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుసగా ఉపశమనాలు కలుగుతున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్, ఐఆర్ఆర్ వంటి ఇతర కేసుల్లో స్వల్ప ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట లభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. అయితే ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీపావళి సెలవులు తరువాత తీర్పు వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు ద్విసభ్యధర్మాసనం వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.