సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఎప్పుడు రావొచ్చు?
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగియగా.. తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. శుక్రవారంలోపు ఆర్గుమెంట్స్ లిఖితపూర్వకంగా ఉంటే చెప్పవచ్చని అవకాశం కల్పించింది. తీర్పును రిజర్వు చేయడంతో ఎప్పుడు ప్రకటిస్తారనేది టీడీపీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తీర్పును రిజర్వు చేసిన తర్వాత ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఎలాంటి పరిమితులు లేవు.
తీర్పు ప్రకటించడానికి ముందు రోజు మాత్రమే ఏ టైమ్‌కు తీర్పు ప్రకటిస్తామనేది సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతోంది. ఇరు వర్గాల వాదనలను లోతుగా విశ్లేషించడానికి కొద్ది రోజులు పాటు సమయం తీసుకుంటారు. దీంతో శుక్రవారం తీర్పు వస్తుందేమోనని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రాకపోతే వచ్చే సోమవారం తర్వాత తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.