YCP:‘ఇంకెంత మంది బాలికలు బలవ్వాలి పవన్?’.. వైసీపీ సంచలన ట్వీట్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో తిరుపతి(శనివారం) జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి(sexual assault) ఆపై హత్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై వైసీపీ స్పందిస్తూ సంచలన ట్వీట్ చేసింది. కూటమి ప్రభుత్వం(AP Government) పై విమర్శలు గుప్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కక్ష సాధింపుల పై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని వైసీపీ ట్విట్టర్(YCP Twitter) వేదికగా వ్యాఖ్యానించింది. తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడి(sexual assault) ఘటనను మెన్షన్ చేస్తూ విమర్శలు గుప్పించింది. మీ చేతగానితనంతో ఇంకెంత మంది బాలికలు ఇలా బలి అవ్వాలి పవన్ కళ్యాణ్ అని వైసీపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఈ ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) , హోం మినిస్టర్ అనిత(Home Minister Anitha) స్పందిచారు. అభం శుభం తెలియని చిన్నారి పై దారుణానికి ఒడిగట్టిన నిందితుని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాస్ వార్నింగ్ ఇచ్చారు.