Vasireddy Padma: మాజీ ఎంపీపై పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు.. అసలు కారణం ఇదే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కీలక నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Former MP Gorantla Madhav)పై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-02 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కీలక నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Former MP Gorantla Madhav)పై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ విజయవాడ (Vijayawada) పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు (CP Rajashekar Babu)ను కలిసి తన ఫిర్యాదును లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను ఎవరైనా గోప్యంగా ఉంచుతారని పేర్కొన్నారు.

కానీ, అంతకు ముందు పోలీసులు వృత్తిలో ఉండి, ఎంపీగా పని చేసిన గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav)కు అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించకూడదనే విషయం కూడా తెలియదని అని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు మాజీ ఎంపీపై ఫోక్సో చట్టం (Pocso Act) కింద కేసు నమోదు చేయాలని సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. తాను ఏ పార్టీలో చేరబోతున్నాననే విషయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) అన్నారు. కాగా, ఇటీవలే ఆమె వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News