Tragic incident:షాకింగ్ ఘటన.. ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య

రాష్ట్రంలో ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

Update: 2024-11-02 08:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ ప్రేమ జంట మనస్పర్థలు రావడంతో 2021లో విడిపోయారు. ఈ క్రమంలో ప్రియుడు గత రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తన ప్రియురాలితో పెళ్లి చేయాలని యువతి కుటుంబ సభ్యులను అడిగాడు. కానీ వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. ఉయ్యూరుకు చెందిన చందా మాధవ రాజు(30), కోరపాటు మాధవి (28) ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి మాధవి వాళ్ళ ఇంటికి వెళ్లిన యువకుడు.. తనకు మాధవితో పెళ్లి చేయమని అడిగాడు. దీనికి మాధవి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇక అర్ధరాత్రి సమయంలో మాధవి వాళ్ళ ఇంటి వరండాలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News