చికెన్ ధరలపై వరదల ఎఫెక్ట్.. కిలో ఎంతంటే?

ఏపీలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-29 09:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఈ క్రమంలో విజయవాడ జిల్లాను వరదలు(Vijayawada Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదల ప్రభావం చికెన్ ధరలపై పడింది. గడిచిన మూడు వారాలుగా చికెన్ ధరలు(Chicken prices) భారీగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు పలుకుతోంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. అమ్మకాలు తగ్గినా చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది.

దసరా నవరాత్రులు ప్రారంభమైతే చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. చికెన్ ధరలు పెరిగిపోవడంతో మాంసాహారులు(carnivores) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వరద ప్రభావం పేరుతో మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. గుంటూరులో గడిచిన కొద్ది రోజులుగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో 200 రూపాయలు పలికిన చికెన్ ఇప్పుడు 270 రూపాయలు పలుకుతోంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీలలో కోళ్ల సరఫరాను పెంచినట్లు సమాచారం.


Similar News